తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం కాంప్లెక్స్ నిండిపోయింది. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. క్యూలైనులో భక్తులు ఆక్టోపస్ క్యాంపస్ వరకు 3 కి.మీ వరకు వేచి ఉన్నారు. భక్తుల దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని అంచనా వేశారు.
క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. పరీక్షల ఫలితాలు రావడం, పాఠశాలలకు వేసవి సెలవులు, పర్వదినాలు, వారాంతం కూడా కావడంతో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లలో 70 వేల మంది భక్తులు ఉన్నారని అంచనా.