హమాస్ ఉగ్రవాదుల అరాచకాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌పై దాడి తరవాత 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిలో ఏడుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు కూడా ఉన్నారు. ఒకరు చనిపోయారు. మరొకరిని ఇజ్రాయెల్ విడిపించింది. మిగిలిన ఐదుగురిని చేతులు కట్టేసి కారులో తరలిస్తున్న వీడియో వైరల్ అయింది. ఇజ్రాయెల్ మహిళా సైనికుల ముఖాలపై తీవ్ర గాయలున్నాయి. వారు నడవలేని స్థితిలో ఉన్నారు. వీడియో చూసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారిని విడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఐదుగురు మహిళా సైనికులు బతికే ఉన్నారనే సమాచారంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ వీడియో తాజాదా, పాతదా అనేది తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్ మహిళా సైనికులను బందీలుగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు ఎక్కడకు తరలిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు