లగ్జరీ కారు అత్యంత వేగంగా నడిపి పుణెలో ఇద్దరిని బలిగొన్న బాలుడికి బెయిల్ ఇవ్వడంపై పోలీసులు రివ్యూ పిటిషన్ వేశారు. పిటిషన్ పరిశీలించిన జువైనల్ జస్టిస్ బెయిల్ రద్దు చేశారు. బాలుడిని అబ్జర్వేషన్ హోంలో పరిశీలనలో ఉంచాలని ఆదేశించారు. అతని మానసిక పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. అతను జనజీవన స్రవంతిలో కలిసేలా తగిన వైద్యసాయం అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ప్రమాదం చేసిన బాలుడిని విచారణ జరిపిన ప్రాంగణంలోనే ఉన్న పిల్లల అబ్జర్వేషన్ హోంకు తరలించారు. ఇప్పటికే అక్కడ 30 మంది ఉన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు హోంలో ఉంచనున్నారు. ఇద్దరిని బలిగొన్న బాలుడికి వెంటనే బెయిల్ ఇవ్వడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు రివ్యూ పిటిషన్ వేశారు.