స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.సెన్సెక్స్ 1196 పాయింట్లు పెరిగి 75418 వద్ద ముగిసింది. నిఫ్టీ 369 పాయింట్లు పెరిగి 22967 వద్ద క్లోజైంది.
యాక్సెస్ బ్యాంకు 3.3 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.16 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.22,
ఎల్ అండ్ టి 3.38, ఎం అండ్ ఎం 3.55, మారుతి 2.82 శాతం లాభాలను ఆర్జించాయి.
ఎన్టీపీసీ 0.43 శాతం, పవర్‌గ్రిడ్ 1.86, సన్‌ఫార్మా 2.94 శాతం నష్టాలను చవిచూశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యారెల్ క్యూడాయిల్ 82.42 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ డివిడెండ్ ప్రకటించడంతో మార్కెట్లు ర్యాలీ తీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.