బెంగళూరుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలో ప్రముఖ హోటల్ ఒట్టేరాతో సహా పలు భవనాల్లో బాంబు పెట్టామంటూ మెయిల్స్ వచ్చాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాంబులను నిర్వీర్యం చేసే బృందాలతో రంగంలోకి దిగారు. ఒట్టేరా హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టారు. ఇంత వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు.
గత కొంత కాలంగా దేశంలో ప్రధాన నగరాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత వారం ఢిల్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. గత నెలలో బెంగళూరు పాఠశాలల్లో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో ఏమీ పట్టుబడకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు వచ్చిన బాంబు బెదిరింపులు కూడా ఉత్తుత్తి బెదిరింపులేననే అనుమానం కలుగుతోంది.