వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సింహాచలం అప్పన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి రెండో చందన సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొపిన అర్చకులు, తదనంతరం ప్రభాత సేవలు కొనసాగించారు.
ముందుగా సిద్దం చేసిన చందనాన్ని స్వామి వారికి సమర్పణ చేశారు. వైశాఖ పౌర్ణమి పర్వదినం కావడంతో ఉత్తర కోస్తా జిల్లాలతో పాటే దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. 60 వేల మంది భక్తులు స్వామి వారిని ఇవాళ సందర్శించుకుంటారని అంచనా. ముందుగా భక్తులు అడివివరం పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.