భారత పార్లమెంటు లోక్‌సభ ఎన్నికలకు ఆరోదశ పోలింగ్ మే 25 శనివారం జరగనుంది. ఆ దశ ఎన్నికలకు ప్రచారపర్వం నేటితో ముగుస్తుంది.
ఆరో దశలో 6 రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలోని మొత్తం 57 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. బిహార్‌లో 8, హర్యానాలోని మొత్తం 10, జార్ఖండ్‌లో 4, ఒడిషాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలోని మొత్తం 7 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.
బిహార్‌లో వాల్మీకినగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వీ చంపారన్, శియోహర్, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్, మహారాజ్‌గంజ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో గిరిధ్, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్ స్థానాల్లో శనివారం పోలింగ్ జరుగుతుంది.
ఒడిషాలో సంబల్‌పూర్, కియోంఝార్, ఢెంకనాల్, కటక్, పూరీ, భువనేశ్వర్ నియోజకవర్గాలకు శనివారం ఎన్నికలు జరుగుతాయి. ఒడిషా శాసనసభలోని 42 నియోజకవర్గాలకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది. ఒడిషా అసెంబ్లీలో మొత్తం 147 స్థానాలున్నాయి. వాటిలో 63 నియోజకవర్గాలకు మే 13, 20 తేదీల్లో పోలింగ్ జరిగింది. మిగిలిన 42 స్థానాలకూ జూన్ 1న ఎన్నికలు జరుగుతాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఆరవ దశలో 14 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అవి సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫూల్‌పూర్, అలహాబాద్, అంబేద్కర్‌నగర్, శ్రావస్తి, దోమరియాగంజ్, బస్తీ, సంత్ కబీర్‌నగర్, లాల్‌గంజ్, ఆజంగఢ్. జౌన్‌పూర్, మఛిలీషహర్, భదోహీ.
పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అవి తామ్లుక్, కంథి, ఘటల్, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్.
ఢిల్లీ పరిధిలో 7 పార్లమెంటరీ నియోజకవర్గాలున్నాయి. అవి చాందినీచౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ. వాటికి కూడా ఆరవ దశలో శనివారం పోలింగ్ జరగనుంది.
నేటితో ప్రచారం ముగుస్తున్న నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరంగా జరుపుతున్నాయి.