కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. 2023-24 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ కేంద్రానికి 2 లక్షల 11 వేల కోట్ల డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఆర్బీఐ కేంద్రానికి డివిడెంట్ అందిస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తం ఇంత వరకు అందించిన దాఖలాలు లేవు. ఆర్బీఐకి ఖర్చులు పోను మిగిలిన ఆదాయంలో కొంత మొత్తం ఏటా డివిడెండ్ రూపంలో కేంద్రానికి అందిస్తుంది.
2022-23లో కేంద్రానికి రూ.87416 కోట్ల డివిడెండ్ అందించిన ఆర్బీఐ, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2.11 లక్షల కోట్లు ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇది కేంద్రం అంచనాలకన్నా దాదాపు రెట్టింపు మొత్తం. ఆర్బీఐ 608వ బోర్డు సమావేశంలో 2.11 లక్షల కోట్ల డివిడెండ్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.