ఐపీఎల్-17లో రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది, ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించింది.
బెంగళూరు టీమ్ సీరీస్ ప్రారంభంలో పెద్దగా ఆడకపోయినా తర్వాత రాణించి వరుసగా ఆరు విజయాలు సాధించి సంచలనం సృష్టించింది. లీగ్ దశలో అద్భుతాలు సాధించిన ఆర్సిబి, ప్లేఆఫ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది.
మరోవైపు, లీగ్దశలో వరసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో అపురూపమైన ప్రతిభ కనబరిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలుపు దక్కించుకుని ఫైనల్ దిశగా పయనిస్తోంది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. బ్యాటర్లలో రజత్ పటీదార్, విరాట్ కోహ్లీ, మహీపాల్ లోమ్రార్ బాగానే ఆడారు. బౌలర్లలో అశ్విన్, అవేష్ ఖాన్, బౌల్ట్ రాణించారు.
ఛేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు బాగా ఆడింది. 19 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకుంది. బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ రాణించారు. బౌలర్లలో సిరాజ్ ప్రతిభ చూపాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు శుక్రవారం సన్‌రైజర్స్‌తో పోటీ పడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.