పోలింగ్ సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ రోజు జరిగిన హింస, ఇతర ఘటనలపై పోలీసులపై కేసు నమోదు చేశారు.
పిన్నెల్లి ప్రస్తుతం తెలంగాణలో ఉండటంతో ఏపీ పోలీసులతో పాటు తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్ లోకేషన్ చేరుకునేందుకు పటాన్చెరు పోలీసుల సహకారం తీసుకున్నారు.
ఎన్నికల రోజున మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు కేసు నమోదైందతి. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు.