గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. చదువు పూర్తి చేసుకుని కుటుంబానికి అండగా నిలవాల్సిన వారు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారతీయుల సంఖ్య పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు, హత్యలకు గురై ప్రాణాలు వదులుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
తాజాగా జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం అలముకుంది.ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరి వయస్సు 18 ఏళ్ళు లోపు కావడంతో పాటు మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. ఈ నెల 14న ఈ ప్రమాదం జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తేల్చారు.
మృతులను అల్ఫారెట్టా హైస్కూల్, జార్జియా యూనివర్సిటీకి చెందిన ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల, అన్విశర్మగా గుర్తించారు. ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా అన్విశర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు