సమాజంలో మరింత ప్రభావశీల శక్తిగా సంఘ్ ఎదిగేందుకు కార్యకర్త వికాసవర్గ దోహదపడుతుందని దక్షిణ మధ్య క్షేత్ర సహక్షేత్ర ప్రచారక్ శ్రీ శ్రీరాం భరత్ కుమార్ అన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని శ్రీ వేద స్కూల్ లో మే 18 నుంచి జూన్ 7 వరకు జరుగుతున్న కార్యకర్త వికాస వర్గ-1 కార్యక్రమంలోశ్రీరాం భరత్ కుమార్ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. కార్యకర్తలకు పలు విలువైన సూచనలు చేశారు.
కష్టపడటానికి సిద్ధమవడం వల్లే రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద అనేక విద్యలు నేర్చుకున్నారని చెప్పారు. ఏ స్థాయి కార్యకర్తగా సంఘలో పని చేస్తున్నప్పటికీ నిరంతరంగా కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలన్నారు.
వర్గలో శారీరక, బౌతిక వ్యవస్థ విషయాలు నేర్చుకోవడంతోపాటు వ్యవహార శిక్షణ కూడా లభిస్తుందన్నారు. మనస్సు, శరీరం, బుద్ధిని నిమగ్నం చేసి మంచి స్యయం సేవక్ గా నిలవాలన్నారు. మంచి చేయడంలో ఆదర్శప్రాయంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కార్యకర్త వికాసవర్గలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన 245 మంది కార్యకర్తలు శిక్షణలో పాల్గొన్నారు. వికాస వర్గ-1కి వర్గాధికారిగా శ్రీ మంచన రామచంద్ర రాజు వర్గ కార్యవాహగా శ్రీ కా.శం.శ్రీధర్ లు వ్యవహరిస్తున్నారు.