తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది.అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాలుగురోజుల పాటు అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉంది.
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణం కేంద్రం ప్రకటించింది.
అల్పపీడనం తర్వాత పొడి వాతావరణం ఏర్పడటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఆవరించింది. దీంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశముంది.