సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. చికిత్స కోసం భార్యను ఆస్పత్రికి తీసుకెళ్ళిన భర్త ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రాంగణంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. నెల రోజుల క్రితమే ఎండిపోయిన ఓ చెట్టు దంపతులు మీద పడటంతో ప్రమాదం జరిగింది.
శామీర్‌పేటలోని తూంకుంటకు సరళాదేవి బొల్లారంలోని త్రిశూల్ పార్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కాలినొప్పికి చికిత్స కోసం భర్త రవీంద్ర(52)తో కలిసి బైక్ పై కంటోన్మెంట్ ఆసుపత్రికి వెళ్ళారు. వారు
ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే చెట్టు కూలి పడిపోయింది. రవీంద్ర ఛాతీపై చెట్టు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రవీంద్ర తన వెనుకున్న సరళాదేవి మీద పడటంతో ఆమె నేలపైపడ్డారు. దీంతో తల, వెన్నుపూస, కాళ్లకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.