కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి లీగ్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)ను చిత్తుగా ఓడించి, నాలుగోసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్.. ఎస్ఆర్హెచ్పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన మిచెల్ స్టార్క్ (3/34), వరుణ్ చక్రవర్తి (2/26)తో పాటు కేకేఆర్ బౌలర్లు సమష్టిగా రాణించారు. 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి, 35 బంతుల్లో 55 పరుగులు చేశారు. కోల్కతా ఈ లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే 2 వికెట్లుకోల్పోయి ఛేదించింది.
వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ జోడీ 97 పరుగుల సునామీ సృష్టించారు. తాజా విజయంతో కోల్కతా నాలుగోసారి ఫైనల్ కు చేరింది. అంతకుముందు 2012, 2014, 2021 ఎడిషన్లలో కోల్కతా ఫైనల్ కు అర్హత సాధించింది.
రాజస్థాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు అహ్మదాబాద్లో మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో హైదరాబాద్ జట్టు 24న తలపడుతుంది. అందులో విజయం సాధిస్తే ఫైనల్లో మళ్లీ కోల్కతా తలపడాల్సి ఉంటుంది.