విమాన ప్రయాణంలో చాలా అరుదుగా కుదుపులు వస్తుంటాయి. వాతావరణం అనుకూలించక పెనుగాలులు వీచిన సమయంలో విమానాలకు కుదుపులు ఎదురవుతుంటాయి. తాజాగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులకు ఓ ప్రయాణీకుడు చనిపోయాడు. 20 మంది గాయపడినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
మే 20వ తేదీన లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం తీవ్ర కుదుపులకు లోను కావడంతో బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. కుదుపులకు లోనైనప్పుడు విమానంలో 211 మంది ప్రయాణీకులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. తీవ్ర కుదుపులు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని తెలుస్తోంది. ఓ ప్రయాణీకుడు మరణించడంపై సింగపూర్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. ఘటనకు గల కారణాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు