ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో విచారణ నిమిత్తం సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ముంబై తరలించారు. బిభవ్ కుమార్ ఉపయోగించిన ఐఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేయించినట్లు ఒప్పుకున్నాడు. డేటా రిట్రైవ్ చేయకుండా అందులోని సమాచారం మొత్తం తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. బిభవ్ ఫోన్ నుంచి సమాచారం తొలగించిన మొబైల్ షాపులో విచారణ చేసేందుకు పోలీసులు ముంబై బయలు దేరారు.
ఐసీపీ 201 సెక్షన్ కింద బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నేరం జరిగిన తరవాత ఆధారాలు చెరిపివేసిన కేసులో బిభవ్‌పై విచారణ జరుగుతోంది. మరో రెండు రోజుల్లో బిభవ్ కష్టడీ ముగియనుండటంతో అతని కస్టడీని మరింత పొడగించాలని తీస్ హజారీ కోర్టులో పిటిషన్ వేసే అవకాశముంది.