హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో ముగిశాయి. వేలాది మంది రైసీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రైసీ మృతదేహంపై జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. దేశమంతా సంతాప దినాలు ప్రకటించారు. రైసీతోపాటు చనిపోయిన మరో ఏడుగురికి కూడా అంత్యక్రియలు నిర్వహించారు.
రైసీ మరణం తరవాత అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రైసీ ప్రయాణించిన హెలికాఫ్టర్‌ను కుట్రతో కూల్చివేశారనే కథనాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇరాన్ మాత్రం రైసీ మరణంలో ఎలాంటి కుట్రలేదని తేల్చి చెప్పింది. రైసీ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.