ఉగ్రవాదులతో లింకులున్నాయనే అనుమానంతో అనంతపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం ఆత్మకూర్ బజారుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ కుమారుడు సోహెల్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసి ప్రశ్నిస్తోంది. సోహెల్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. అతని బ్యాంకు ఖాతాలో ఇటీవల పెద్దమొత్తంలో డబ్బు జమ కావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గతంలో కూడా సోహెల్‌కు ఉగ్ర వాదులతో లింకులున్నాయని ఎన్ఐఏ ప్రశ్నించింది. విదేశాల నుంచి అతని బ్యాంకు ఖాతాకు పెద్దమొత్తంలో డబ్బు జమ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.