లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, వెంటనే లొంగిపోవాలంటూ, మాజీ సీఎం కుమారస్వామి హితవు చెప్పారు. అశ్లీల వీడియోలు సమాజం తలదించుకునేలా చేశాయని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కుమారస్వామి క్షమాపణలు చెప్పారు. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రజలను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి దేవెగౌడ రాజీనామా చేస్తానని చెప్పారని, తామంతా వద్దని వారించినట్లు గుర్తుచేశారు.
ఎన్నికల తరవాత ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడని కుమారస్వామి చెప్పారు. విచారణకు హాజరు అవుతాడనుకున్న సమయంలో, అత్యాచారం కేసులో అరెస్ట్ చేస్తారనే వదంతులు రావడంతో రేవణ్ణ స్వదేశం రాలేదని కుమారస్వామి చెప్పుకొచ్చారు. రేవణ్ణకు కలవడానికి తాను వెళ్లానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కుమారస్వామి కొట్టిపారేశారు.తల్లిదండ్రుల ఆరోగ్యంపై విచారించేందుకు పద్మనాభనగర్ వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు