నిషేధిత ఐఎస్ఐఎస్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఇవాళ(సోమవారం) నలుగురిని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
శ్రీలంక జాతీయులైన మహ్మద్ నుస్రత్, మహ్మద్ నుఫ్రాన్, మహ్మద్ ఫరిస్, మహ్మద్ రాజ్దిన్ నిషేధిత ఇస్లాం ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ఉగ్రవాదుల రాకపై కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ డీజీపీ వికాష్ సహాయ్ వెల్లడించారు.
నలుగురు తీవ్రవాదులు చెన్నై నుంచి అహ్మదాబాద్ చేరుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పట్టుబడిన ఉగ్రవాదులు భారత్ లో భారీ కుట్రకు తెగబడినట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల అహ్మదాబాద్ లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు.
దిల్లీ-పడ్గా ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ కేసులో మార్చి 21న ఎన్ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది. యూపీకి చెందిన మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, ఉత్తరాఖండ్ కు చెందిన మహ్మద్ ఆర్షాద్ వార్సి, జార్ఖండ్ కు చెందిన మహ్మద్ షెహనాజ్ ను ఎన్ఐఏ నిందితులుగా పేర్కొంటూ ఛార్జీషీటు దాఖలు చేసింది. వీరంతా భారత వ్యతిరేక అజెండాతో కుట్రకు పథకం రచించినట్లు విచారణలో తేలింది. భారత్ వ్యాప్తంగా హింసకు పాల్పడేందుకు భారీగా నిధులు కూడా సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు