ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ మూడు వరకు పొడిగించింది. కవిత రిమాండ్ నేటితో ముగియనుండగా ఈడీ న్యాయవాదులు, కవితను కోర్టులో హాజరు పరిచారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా, కవితకు 14 రోజులు జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించారు.
ఢిల్లి లిక్కర్ పాలసీని సవరించి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా మలుచుకున్నారంటూ నమోదైన కేసులో కవిత తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, కవితకు బెయిల్ ఇస్తే నిందితులను బెదిరించే అవకాశముందని ఈడీ,సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో కవితకు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.