ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా షేర్ చేశారు.
పూరీలో జగన్నాథ్ స్వామిని దర్శించుకున్నానని ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉంటాయన్నారు.
అనంతరం పూరీలో నిర్వహించిన ర్యాలీలో ఒడిశాలోని పాలకపార్టీ బీజేడీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. బీజేడీ పాలనలో జగన్నాథ్ ఆలయం సురక్షితంగా ఉండదన్నారు. గత ఆరేళ్లుగా రత్నభండార్ తాళాలు కనిపించడం లేదన్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం కిందిభాగంలో ఓ రత్న భండాగారం ఉంది. రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, విలువైన ఆభరణాలు ఈ గదిలోనే భద్రపరిచారు. భండార్ తెరిచేందుకు కొన్నేళ్ళ కిందట ప్రయత్నాలు జరిగాయి. అప్పటి నుంచి కీలక విభాగాల తాళాలు కనిపించకుండా పోయాయి. దీంతో ఆభరణాల భద్రతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.