స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. కొందరు కస్టమర్లకు సాధారణ ఎస్ఎమ్మెస్‌ల రూపంలోనూ మోసపూరిత లింకులు చక్కర్లు కొట్టడంపై స్పందించిన ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న మోసాలపై స్పందించిన SBI, ఖాతాదారులకు తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది. వాట్సప్, ఎస్ఎమ్మెస్‌లో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు అని సూచించింది.
ఎస్‌బీఐ పేరిట వాట్సప్‌లో రివార్డ్స్ లింకు ఒకటి విస్తృతంగా ప్రచారమవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్మి సులభంగా మోసపోతున్నారు.
‘‘ మీ ఎస్‌బీఐ రివార్డ్ రూ.7,250 యాక్టివేట్ అయింది. దీని గడువు ఈ రోజుతో ముగిసిపోతుంది. డబ్బులు జమ చేసుకునేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి.’’ అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ యోనో పేరిట ఓ తప్పుడు లింకును సైతం జత చేస్తున్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు