బెంగళూరు శివారులో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న సుమారు వందమందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ కు చెందిన వాసు అనే యువకుడి పుట్టిన రోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేయగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఫాంహౌస్ ఆవరణలో పార్కు చేసిన ఓ కారులో ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరిట పాస్ ఉన్నట్లు కన్నడ మీడియా పేర్కొంది. అయితే ఆ కారు తనది కాదని సదరు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారట.
ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారం ఆధారంగా సీసీబీ పోలీసులు సోదాలు చేశారు. తనిఖీల్లో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫాంహౌస్ ఆవరణలో పార్క్ చేసిన మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ కార్లను సీజ్ చేశారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు