ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ దాడి తరవాత జరిపించిన వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. దాడి తరవాత నమోదైన కేసు విచారణలో భాగంగా పోలీసులు ఎంపీ స్వాతి మాలివాల్‌కు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించారు. స్వాతికి ఎడమకాలు, కుడి కన్ను కింద గాయాలున్నాయని వైద్యులు పేర్కొన్నారు. మూడు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. శరీరంలో లోపల కూడా గాయాలున్నాయని వైద్యుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది.
ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి తరవాత సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని బైభవ్ డిలీట్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ ఎంపీపై దాడి చేయడం చాలా తీవ్రమైన నేరమని ఢిల్లి డిప్యూటీ కమిషనర్ అంజిత స్పష్టం చేశారు. దర్యాప్తునకు బిభవ్ సహకరించడం లేదని ఆమె చెప్పారు. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె తెలిపారు.