ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ఆయన మరణించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఆదివారంనాడు రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటన విషయం తెలియగానే సైన్యం రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. వాతావరణం సహకరించకపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. మానవ రహిత విమానాలను రంగంలోకి దింపి ప్రమాద ప్రాంతాన్ని గుర్తించారు.
ఈ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్బైజాన్ గవర్నర్ రహ్మతీ కూడా చనిపోయినట్లు ప్రకటించారు. రైసీ మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.