ఇరాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ అడవుల్లో కుప్పకూలింది. అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ ఎవరూ ప్రాణాలతో మిగలిలేరని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటించింది. మానవ రహిత విమానాలతో గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఐఆర్సీఎస్ దళాలు చేరుకున్నాయి.
తావిల్ ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలిపోయి ఉండవచ్చని మొదట అంచనా వేశారు. అక్కడకు సైన్యాన్ని పంపారు. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు కష్టం అవుతోంది. రైసీ ఆచూకీ ఇంత వరకు లభించలేదు. పొగమంచు, వర్షం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని ఇరాన్‌కు చెందిన ఓ అధికారి ఒకరు ప్రకటించారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు ఆదివారం గుర్తించారు. అయితే అది సురక్షితంగా ఉందా లేదా అనే విషయం ప్రకటించలేదు. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ కూలిపోవడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందనేని ఇంకా తెలియాల్సి ఉంది.