దేశంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసే నైరుతి రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా సమాచారం వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలో విస్తరించాయని, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోనూ ప్రవేశించాయని వివరించింది.
రుతుపవనాలు ముందుకు కదలడానికి అనువైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని పేర్కొంది. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయవ్య దిశగా ప్రయాణించి మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు