ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కు తీస్ హజారీ కోర్టు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. బిభవ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని, జుడీషియల్ కస్టడీకి అనుమతించాలంటూ పోలీసు శాఖ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ తీస్ హజారీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఎంపీ మాలివాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలోనే దాడి జరగడంతో ఆయన్ను కూడా విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. బిభవ్ తనను విచాక్షణా రహితంగా కొట్టాడంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.