ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్
కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌పై పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఆధారాల చెరిపివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడికి దిగాడనే ఆరోపణలపై బిభవ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఆప్ ఎంపీ స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇది చాలా తీవ్రమైన నేరమని వెల్లడించారు. స్వాతి మాలీవాల్‌పై దాడి తరవాత సీసీ కెమెరా విజువల్స్ డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక బిభవ్ విచారణకు సహకరించడం లేదని బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశముందని పోలీసులు తెలిపారు.
బిభవ్ తన ఐఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. ముంబైలో
తన ఫోన్ రిపేరు చేయించినట్లు చెబుతున్నాడని చెప్పారు. బిభవ్‌ను ముంబై తీసుకెళ్లి విచారించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.