కర్ణాటకలో వందలాది మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటోన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఈ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు హాజరుకాకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు రాగానే హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయారు. తరవాత అక్కడ నుంచి రైల్లో ఇంగ్లాండ్ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్ తిరిగి రావడానికి అనేక మార్లు విమాన టికెట్లు బుక్ చేసుకుని చివరి క్షణంలో రద్దు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రేవణ్ణ అరెస్టుకు ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. రేవణ్ణ బ్యాంకు ఖాతాలపై సిట్ నిఘా పెట్టింది.