భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయని ప్రకటించింది. అక్కడ నుంచి మే చివరి నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ 1 నుంచి 15 తేదీ నాటికి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశముందని అంచనా వేశారు. మే 5 తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశముందని ఐఎండి తెలిపింది.
తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, శ్రీలంక మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశ ముందని ఐఎండీ ప్రకటించింది.
మే 22న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, అది 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారవచ్చని కూడా భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది.