ఉత్తరప్రదేశ్ లోని బదోహి జిల్లాలో నెవ్వరపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో రూ. 9, 900 కోట్లు జమ అయ్యాయి. విషయం తెలుసుకుని బ్యాంకు అధికారులతో మాట్లాడగా సాఫ్ట్వేర్ లోపమంటూ అధికారులు సదరు అకౌంట్‌ను తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
భానుప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. బ్యాంక్ లావాదేవీల్లో ఈ అకౌంట్ ఎన్పీఏగా ఉంది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్లో ఒక్కసారిగా రూ. 99,99,94,95,999.99 జమ అయినట్లు చూపుతోంది.
విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సాఫ్ట్ వేర్ లోపం కారణంగా అలా జరిగిందని బదులిచ్చారు. పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టినట్లు బ్యాంకు మేనేజర్ పేర్కొన్నారు.