కోవిడ్ 19 సింగపూర్లో మరోసారి వెలుగు చూసింది. మే 5 నుంచి 11 మధ్యలో సింగపూర్లో 25900 కేసులు నమోదు కావడంతో మాస్కులు తప్పనిసరి చేశారు. కోవిడ్ మహమ్మారి మరలా విరుచుకుపడుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ హెచ్చరించారు.
కోవిడ్ కేసులు వేగంగా పెరగడంతో రాబోయే నెల రోజుల్లో గరిష్ఠ స్థాయికి చేరవచ్చని అంచనా వేశారు. ప్రతి రోజూ కొత్తగా 250 కేసులు నమోదవుతున్నాయని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతూ ఉండటంతో ఆసుపత్రులు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ రోగులకు సరిపడినన్ని పడకలు సిద్దంగా ఉంచాలని, అత్యవసరం కాని చికిత్సలు వాయిదా వేసుకోవాలని సింగపూర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.