కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో శుక్రవారం సస్పెండ్, బదిలీ అయిన ఎస్పీలు, కలెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీని నియమించింది. పల్నాడు జిల్లాకు మల్లికా గార్గ్, తిరుపతి జిల్లాకు హర్షవర్థన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియామిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలకు ముందు, తరవాత అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో చెలరేగిన హింసను అదుపు చేయడంతో ఆయా జిల్లాల ఎస్పీలు విఫలమయ్యారని సీఈసీ వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెండ్, పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన స్థానంలో ఇవాళ కొత్తవారిని నియమించింది. వెంటనే విధుల్లో చేరాలని సీఈసీ ఆదేశించింది.