తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేశారు. ఇది మే 24 నాటికి వాయుగుండంగా మారే ప్రమాద ముందని ఐఎండీ తెలిపింది.
కోస్తా, రాయలసీమ, తెలంగాణ మీదుగా శ్రీలంక వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశ ముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.