జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ మొదటిసారి స్పందించారు. లైంగిక ఆరోపణల కేసులో ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వ్యవహారంలో వందలాది మందికి సంబంధం ఉందని, ఎవరినీ వదలిపెట్టవద్దకూడదన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హెచ్డి కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతివారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. తమతో టచ్లో లేడని కుమారస్వామి వెల్లడించారు. అతను విదేశాలకు పారిపోక ముందు కూడా తమతో టచ్లో లేడని గుర్తుచేశారు. ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది. లైంగికదాడులకు గురైన బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసులో హెచ్డి రేవణ్ణను మే 4 వ తేదీన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.