పార్లమెంటు ఎన్నికల ఐదో దశ పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగుస్తోంది. మే 20న జరిగే పోలింగ్‌లో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
బిహార్‌లో 5 నియోజకవర్గాలకు, జార్ఖండ్‌లో 3 స్థానాలకు, మహారాష్ట్రలో 13 సీట్లకు, ఒడిషాలో 5 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాలకు, పశ్చిమబెంగాల్‌లోని 7 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. తొలిసారి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎన్నికలు జరుగుతున్న జమ్మూకశ్మీర్‌లోని ఒక స్థానానికి, లద్దాఖ్‌లోని ఏకైక పార్లమెంటరీ నియోజక వర్గానికీ పోలింగ్ జరగనుంది. ఈ దశతో మహారాష్ట్రలోని మొత్తం 48స్థానాల్లోనూ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
ఒడిషా శాసనసభకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో రెండో దఫా పోలింగ్ మే 20న జరగనుంది. ఆ దశలో మొత్తం 147 నియోజకవర్గాలకుగాను 35 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
ఇవాళ సాయంత్రంతో ఐదోదశ ఎన్నికలకు ప్రచారం పూర్తవుతుంది. దాంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.