భారతదేశంలోని
అతిపెద్ద సంస్థానాల్లో వెంకటగిరి కూడా ఒకటి. ఘనమైన చరిత్ర కలిగిన వెంకటగిరి, రాజకీయాల్లోనూ
అదే పరపతిని కొనసాగిస్తోంది. 2024 ఎన్నికల్లో వెంకటగిరి శాసనసభ ఎన్నికలో పోటీ
పడుతున్న రెండుప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ ఇద్దరే. బలమైన రాజకీయ కుటుంబ
నేపథ్యం ఉన్నవారే కావడం విశేషం.
వైసీపీ
నుంచి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్
రెడ్డి పోటీకి దిగగా, టీడీపీ నుంచి రెండు దఫాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన
కోరుకుండ్ల రామకృష్ణ పోటీలో ఉన్నారు. హస్తం గుర్తుపై శ్రీనివాసులు నామినేషన్ వేశారు.
నియోజకవర్గ
రాజకీయాల్లో వెంకటగిరి సంస్థాన వారసులపాత్ర కీలకం. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం
చేయగల సమర్థులు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మద్దతు తెలిపిన వెంకటగిరి
రాజకుటుంబం ఆ తర్వాత వైసీపీకి సహకరిస్తోంది.
2009,
2014 లోటీడీపీ నుంచి పోటీ చేసిన రామకృష్ణ వెంకటగిరి నుంచి విజయం సాధించగా, 2004,
1999లో నేదురుమల్లి రాజ్యలక్ష్మీ గెలిచారు.
2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన
మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో రామకృష్ణ ఓడారు.
2018లో
టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, ప్రస్తుతం వైసీపీని వీడారు. ఈ
ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఆత్మకూరు నుంచి పోటీకి దిగారు.