సూళ్లూరుపేట శాసనసభ స్థానంలో టీడీపీ
నుంచి విజయశ్రీ, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య పోటీలో ఉన్నారు. కాంగ్రెస్
పార్టీ నుంచి చందనమూడి శివ నామినేషన్ వేశారు.
విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం
ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. స్థానిక నేతలతో ఆయనకు
పరిచయాలు ఉన్నాయి. కొద్దికాలం వైసీపీలోనూ ఉండటంతో ఆ పార్టీ కేడర్ తోనూ సంబంధాలు
ఉన్నాయి.
వైసీపీ అభ్యర్థిగా మూడోసారి బరిలో దిగిన
సిటింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య తన
గెలపు తథ్యమని దీమా వ్యక్తం చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో సంజీవయ్య భారీ
మెజారిటీ సాధించారు. ఆయనకు 119627 ఓట్లు పడగా
టీడీపీ 58,335 ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. జనసేన పార్టీ తరఫున పోటీ
చేసిన ఉయ్యాల ప్రవీణ్ కు 5513 ఓట్లు మాత్రమే పడ్డాయి.
2014 లోనూ వైసీపీ నుంచి పోటీ చేసిన
కిలివేటి సంజీవయ్యనే ప్రజలు ఆశీర్వదించారు.
1994 నుంచి 2009వరకు ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.