గూడూరు
రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించిన
వైసీపీ, ఎమ్మెల్సీ గా ఉన్న మేరిగ మురళీని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామంతో
నొచ్చుకున్న ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేశారు.
వెనువెంటనే బీజేపీ లో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీకి దిగారు.
2014
ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వరప్రసాదరావు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ
తర్వాత 2019 లో గూడూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
వెంకటగిరి
నియోజకవర్గానికి చెందిన మేరిగ మురళీ(వైసీపీ అభ్యర్థి), ఇంజినీరింగ్ పట్టభద్రుడు.
మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు.
2011లో
వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ గూడూరులో ఆ పార్టీ
విజయం సాధించింది. 2014లో పాశం సునీల్ కుమార్( వైసీపీ) టీడీపీ తరఫున బరిలో
నిలిచిన రాధ జ్యోత్స్న లతను ఓడించారు. ఆ తర్వాత 2019లో సునీల్ కుమార్ టీడీపీ నుంచి
పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడారు.
గూడూరులో
టీడీపీ ఐదుసార్లు విజయం సాధించింది. 1983లో జోగి మస్తానయ్య, 1985, 1994, 1999,
2009 లో బల్లి దుర్గాప్రసాద్ జయకేతనం ఎగురవేశారు.