సర్వేపల్లి
నియోజకవర్గంలో గత రెండు దఫాలు వలే ఈ సారి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి
చంద్రమోహన్ రెడ్డి మధ్యే బ్యాలెట్ ఫైట్ జరుగుతోంది. పొదలకూరు మండలం తోడేరు గ్రామానికి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, 2014, 2019లో
సర్వేపల్లి నుంచి పోటీ చేసి , టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి
చంద్రమోహన్ రెడ్డిపై విజయం సాధించారు.
2019 విజయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్న గోవర్ధన్ రెడ్డి, మళ్లీ సర్వేపల్లి నుంచే
పోటీకి సిద్ధమయ్యారు. టీడీపీ నుంచి పోటీ
చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయభవిష్యత్ ను ఎన్నికల
ఫలితాలే ఆయన రాజకీయ భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ కూడా బరిలో ఉంది.
మోతూకూరు,
పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగుడూరు ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి.
1955 నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. 1994, 1999 ఎన్నికల్లో ఈ
సీటు నుంచి గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, 2004, 2009లో ఆదాల ప్రభాకర్
రెడ్డి చేతిలో ఓడారు.
నాలుగు
సార్లు ఓడిపోయారనే సానుభూతికి తోడు కూటమి కారణంగా సోమిరెడ్డి ఈ దఫా విజయం
సాధిస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. వైసీపీ
ని వీడి కొందరు నేతలు టీడీపీలో చేరడం ఆయనకు కలిసి వచ్చే అంశం.
మంత్రి
గోవర్ధన్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ని
గెలిపిస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలకు వివరిస్తున్నారు. సర్వేపల్లిలో టీడీపీకి
పూర్వ వైభవం వస్తుందా…?
వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా
తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.