ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆప్ పార్టీ అధినేతగా ఉన్న కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించేందుకు, మద్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన సర్వన్నత న్యాయస్థానం జూన్ 1వ తేదీ వరకు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2వ తేదీ కల్లా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మద్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మే7న విచారణ జరిపింది. తీర్పును రిజర్వులో ఉంచారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చారు.
ఢిల్లి లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడటంతోపాటు, కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.