వాయులింగేశ్వరుడిగా
పరమేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2024-ఎన్నికల పోరు ఆసక్తి
రేపుతోంది.
నియోజకవర్గంలో
శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు మండలాలు ఉన్నాయి. వైసీపీ
నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎన్డీయే నుంచి టీడీపీ తరఫున బొజ్జల
సుధీర్ రెడ్డి పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి పోతుగుంట రాజేష్ కూడా
ఎన్నికల కదనరంగంలోకి దిగారు.
బియ్యపు
మధుసూదన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై మూడో దఫా పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ
అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిన మధుసూదన్ రెడ్డి, 2019లో పోటీ చేసి
అసెంబ్లీ అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు
సుధీర్ రెడ్డి, తెలుగు దేశం నుంచి పోటీ చేసి ఓడారు. 2024 పోరు కూడా ఈ ఇద్దరి నేతల
మధ్య జరుగుతోంది.
రెండో దఫా విజయం సాధించడమే లక్ష్యంగా మధుసూదన్ రెడ్డి
పనిచేస్తున్నారు. ఈ సారి గెలిచి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని
సుధీర్ రెడ్డి శ్రమిస్తున్నారు.బొజ్జల
గోపాలకృష్ణా రెడ్డి ఐదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం
వహించారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కేడర్ ఉన్న
చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి ఒకటి.
బీజేపీ నేత కోలా ఆనంద్ ఇక్కడ పార్టీని బలోపేతం చేశారు.
కేంద్రప్రభుత్వ
పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి అర్హులకు ప్రభుత్వ సాయం అందేలా పనిచేశారు.