ఆంధ్రప్రదేశ్
లోని ఆసక్తికరమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో
2,90,762 మంది ఓటర్లు ఉన్నారు. వైసీపీ తరఫున
భూమన అభినయరెడ్డి పోటీలో ఉండగా, తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు.
జాతీయ
జనసేన పార్టీ తరఫున దాఖలైన నామినేషన్ కాక రేపుతోంది. జాతీయ జనసేన పార్టీ
అభ్యర్థిగా అల్లూరి శ్రీనివాసులు నామినేషన్ వేశారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు
గాజు గ్లాసు కాగా.. దాదాపు అదే పోలికలతో ఉన్న బకెట్ గుర్తు జాతీయ జనసేన పార్టీకి
ఎన్నికల సంఘం కేటాయించింది.
ఎన్డీయే
కూటమిలో భాగంగా గాజు గ్లాసు గుర్తుపై జనసేన అభ్యర్థిగా ఆరణి
శ్రీనివాసులు పోటీ చేస్తుండగా టీడీపీ,
బీజేపీ మద్దతిస్తున్నాయి. సీపీఐ నుంచి పి. మురళీ పోటీలో ఉన్నారు.
వైసీపీ
అభ్యర్థి భూమన అభినయరెడ్డి, సీఎం జగన్
హయాంలో జరిగిన అభివృద్థి, సంక్షేమాన్ని వివరించి ప్రజలను ఓట్లువేయాలని
కోరుతున్నారు.
టిడిపి-జనసేన
మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను
వివరిస్తున్న అరణి శ్రీనివాసులు …..పొత్తులో ఉన్న పార్టీల నేతలను కలుపుకుని ఆయన
ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
1983 లో ఎన్టీఆర్ ఈ స్థానం నుంచి విజయం
సాధించారు. 1994లో ఆవుల మోహన్, 1999లో చదలవాడ కృష్ణమూర్తి కూడా టీడీపీ నుంచి విజయం
సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి విజయం సాధించారు.
2012లో
జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన ఎం. వెంకటరమణపై
17 వేల ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తి
మూడో స్థానంలో నిలిచారు. 2014లోనూ మళ్ళీ టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ అభ్యర్థి
భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ నుంచి పోటీ చేసిన వెంకటరమణ గెలిచారు.
2015 ఉప
ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి
పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గెలవగా, టీడీపీ నుంచి పోటీ చేసిన సుగణ రెండో
స్థానంలో నిలిచారు. జనసేన తరఫున పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తి 12 వేల ఓట్లతో మూడో
స్థానానికి పరిమితం అయ్యారు.