ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గనుల శాఖ అధికారులు వెంటనే ఇసుక అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. కేంద్రంలోని పర్యావరణ మంత్రి, అధికారులు అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాలను పరిశీలించి, చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించినా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు కూడా లెక్కచేయకుండా, ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారంటూ సాక్ష్యాధారాలు, ఫోటోలతో సహా ఎన్జీవో నేత నాగేంద్రకుమార్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఓఖా ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.