Madanapalle
Assembly Constituency Profile
భారత జాతీయగీతం జనగణమనకు
స్వరకల్పన చేసిన ప్రదేశం మదనపల్లె. ఆంధ్రాఊటీగా పేరుగాంచిన ప్రదేశమిది. మదనపల్లె
శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో మూడు మండలాలు
ఉన్నాయి. అవి రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లి.
మదనపల్లెలో 1952, 1962
ఎన్నికల్లో సిపిఐ గెలిచింది. 1955, 1967, 1972, 1978, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్
విజయం సాధించింది. 1983, 1985, 1994, 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు
దక్కించుకుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సిపి విజయం సాధించింది.
2024 ఎన్నికల్లో
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా నిసార్ అహ్మద్ బరిలో ఉన్నారు. వైసీపీ మూడుసార్లూ
ముగ్గురు అభ్యర్ధులను మార్చడం గమనార్హం. ఇక ఎన్‌డీఏ కూటమి తరఫున తెలుగుదేశం షాజహాన్
బాషాను రంగంలోకి దింపింది. మరోవైపు ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి మల్లెల
పవన్‌కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు.