Pileru
Assembly Constituency Profile
అన్నమయ్య జిల్లా
రాజకీయాల్లో పీలేరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పీలేరు శాసనసభా
స్థానం 1951లో ఏర్పడింది.ఆ నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి. అవి గుర్రంకొండ
(హార్సిలీ హిల్స్), వాల్మీకిపురం, పీలేరు, కలికిరి, కలకడ. కంభంవారిపల్లె.
పీలేరులో 1952, 1955లో
కృషికార్ లోక్ పార్టీ గెలిచింది. 1962లో ఒకసారి సిపిఐ గెలిచింది. 1967, 1972,
1978లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. 1983లో రంగప్రవేశం చేసిన తెలుగుదేశం 1985, 1994
ఎన్నికల్లో గెలిచింది. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఆధిక్యం నిలబెట్టుకుంది.
వైసీపీ అభ్యర్ధి చింతల
రామచంద్రారెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మీద విజయం
సాధించారు. కిషోర్ 2014లో జనసేన నుంచి, 2019లో తెలుగుదేశం నుంచి పోటీ చేసారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల
రామచంద్రారెడ్డికే మూడోసారి టికెట్ ఇచ్చింది. ఎన్డిఎ కూటమి నుంచి టిడిపి
అభ్యర్ధిగా ఈసారి కూడా నల్లారి కిషోరే నిలబడ్డారు. ఇండీ కూటమి నుంచి బాలిరెడ్డి
సోమశేఖర్ రెడ్డి బరిలోకి దిగారు.