ప్రసిద్ధ
పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. ఉత్తరాఖండ్
సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజ చేశారు.
పరమేశ్వరుడి
12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఒకటి.
చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథుడి దర్శనం చేసుకోవచ్చు.
శీతాకాలంలో ఆలయాన్ని మూసివేసి మళ్ళీ
వేసవిలో తెరుస్తారు. నేడు సుమారు 40
క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే స్వామి
దర్శనానికి పోటెత్తారు.
గంగోత్రి
ఆలయం మాత్రం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుచుకోనుండగా చార్ధామ్
యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న
తెరవనున్నారు.